తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ముద్దుబిడ్డ ప్రెస్ క్లబ్ (సీనియర్స్)జర్నలిస్ట్ మండల అధ్యక్షునిగా కొలిపాక చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఈ సందర్భంగా జూలూరుపాడు మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వారికి శాలువాతో సన్మానించి,సీట్లు, పంచి శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా విలేకరుగా సేవలందిస్తున్న చంద్రశేఖర్ సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కడియాల శీను జిల్లా కార్యవర్గ సభ్యుడు మాడుగుల నాగరాజు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మాడుగుల నరేష్,టౌన్ ప్రెసిడెంట్ కడియాల నరేష్, వల్లోజి రమేష్ కడియాల హరీష్ కడియాల నాగేశ్వరరావు, ముదునూరు బుచ్చిబాబు, వల్లోజి నాగరాజు, శేషాద్రి మధు, నిడిగొండనరసింహారావు, వల్లోజి సైదులు, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ