తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ.భారతదేశ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలని, ఆ బాధ్యత మన ఆయుర్వేద వైద్యుల పైనే ఉందని ప్రముఖ దైవ క్షేత్ర పీఠాధిపతులు శివ స్వామీజీ అన్నారు. భద్రాచలంలో జరుగుతున్న వైద్య సంఘం మహాసభల చివరి రోజు అయిన గురువారం ఆయన ముఖ్య వక్తక పాల్గొని ప్రసంగించారు. అందరికీ ఆయుర్వేదం అందేలాగా కృషి చేయాల్సిన బాధ్యత వారంపర వైద్యుల పైనే ఉన్నదని వెల్లడించారు. ప్రతి వ్యాధికి ఔషధం ఉండే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తొమ్మిది రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులను, సభల నిర్వహకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం స్వామీజీనీ నిర్వాహకులు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారందరికీ స్వామీజీ చేతుల మీదుగా మేమంటూ ప్రశంసా పత్రాలను అందించారు.ఈ సభలో మల్లిశాలస్వామీజీ, కృష్ణయ్య స్వామి, పుత్తూరు వైద్య వ్యవస్థాపకులు చంద్రశేఖర రాజు, పారం పర్య వైద్య మహా సంఘం వ్యవస్థాపకులు సజ్జన రమేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దొంతు యాత్రి మహా రుషి, ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, ఎండి. జమాల్ ఖాన్, రామంచి శ్రీనివాస్, భాను ప్రసాద్, దుర్గారాణి, అరుణ, వీరభద్రాచారి, రామకృష్ణ, వాహేదలి, బొబ్బిలి మోహన్, పద్మారావు, సిహెచ్ రవీందర్, రాచూరి రాజు, ఆ సంఘం జిల్లా కన్వీనర్ జి. సుగుణారావు, నాగేశ్వరరావు లు పాల్గొనీ మాట్లాడారు. 500 రకాల ఔషధ మొక్కలను, మహాసభల స్టాల్లో ఏర్పాటుచేసి, అందరికీ ఉచితంగా పంచిన కొత్తగూడానికి చెందిన మొక్కల వెంకటయ్యను ఈ సందర్భంగా శివ స్వామీజీ అభినందించారు. అతిథులకు స్వామీజీకి మొక్కలను అందించి, చిన్నారి ప్రకృతి ప్రేమికులు నైనికరజువా, ఆఫాన్ జై ది లు పలువురి అభినందనలు అందుకున్నారు.మహాసభలలో పాల్గొన్న అందరికీ ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా అందించిన, నేషనల్ ట్రెడిషనల్ డీలర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం సర్టిఫికెట్స్ ను అందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ