Thursday, 17 September 2026 06:46:59 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భూకబ్జా యత్నాలను అడ్డుకుని బాధిత రైతుకు రక్షణ కల్పించాలి: భూక్యా సీతారాం నాయక్.

Date : 11 August 2026 08:21 PM Views : 195

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం గట్టు మల్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి పంటను ధ్వంసం చేయడం, బలవంతంగా పామాయిల్ మొక్కలు నాటడం, భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ డిమాండ్ చేశారు.ఈ మేరకు బాధిత రైతు భట్టు హరి తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు కాపీని A.O. రామకృష్ణకి అందజేశారు.గట్టు మల్ల గ్రామ పరిధిలోని సర్వే నం. 120లో 9.01 ఎకరాలు, సర్వే నం. 119/A/1లో 1.01 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి భట్టు శ్రీనివాస్ పేరుపై పట్టా పాస్‌బుక్‌లు, భూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. భట్టు శ్రీనివాస్ విదేశాల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నందున, తన మేనల్లుడు భట్టు హరికి 25-06-2025న Special Power of Attorney (SPA) ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.గతంలో భూమిలో బోరు వేస్తున్న సమయంలో అడ్డుకోవడం, బోరులో రాళ్లు వేయడం, కేసింగ్ పైపులను ధ్వంసం చేయడం, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో పాటు, గతంలో SC/ST (Prevention of Atrocities) Act కింద కేసు కూడా నమోదు అయినట్లు వెల్లడించారు. అలాగే 24-03-2026న అదే వ్యవసాయ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఇటీవల సుమారు 40–50 మంది వ్యక్తులను భూమి వద్దకు తీసుకువచ్చి, పత్తి పంటను ట్రాక్టర్‌తో దున్ని నాశనం చేయడంతో పాటు, భూ యజమాని అనుమతి లేకుండా పామాయిల్ మొక్కలను నాటినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు దాడికి ప్రయత్నిస్తూ, ప్రాణహాని కలిగించే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ మాట్లాడుతూ, భట్టు శ్రీనివాస్ భూములను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ హక్కుదారులను నిర్ధారించాలని, పంట నష్టం, అక్రమ ప్రవేశం తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను కోరారు.బాధిత రైతు కుటుంబానికి తక్షణ పోలీసు రక్షణ కల్పించి, భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పంటలను ధ్వంసం చేయడం, బలవంతంగా మొక్కలు నాటడం వంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పోలీస్, రెవెన్యూ శాఖలకు అందించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. భట్టు శ్రీనివాస్ భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలి. భూమి హక్కులు, శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ అధికారుల బాధ్యత. అధికారులు స్పందించి న్యాయం చేయని పక్షంలో బంజారా బిడ్డలను ఏకం చేసి, మా బంజారా బిడ్డ భట్టు శ్రీనివాస్ భూమిని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం అని భూక్యా సీతారాం నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, భట్టు నరేష్ నాయక్, భట్టు వీరన్న నాయక్, భట్టు హరి నాయక్, బానోత్ సందీప్ నాయక్, బానోత్ సతీష్ నాయక్, భట్టు తేజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :