Thursday, 17 September 2026 08:15:36 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

తిరుపతిలో మనోళ్లు దుమ్ము దులిపేశారు..! ఫైనల్స్ లో బీసీసీ (వెస్ట్ గోదావరి)పై బీకేసీఏ (భద్రాద్రి) ఘనవిజయం

Date : 30 August 2025 09:40 AM Views : 1110

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్రాష్ట్ర "అండర్–17" క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకున్న భద్రాద్రి కుర్రోళ్ళు. ఫైనల్స్ లో బీసీసీ (వెస్ట్ గోదావరి)పై బీకేసీఏ (భద్రాద్రి) ఘనవిజయం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో గల తిరుమలగుంట కేవీఎస్ టీగ్రౌండ్ లో గత నాలుగు రోజులుగా జరిగిన "అండర్–17 ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ 2025" క్రికెట్ ట్రోఫీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడానికి చెందిన బీకేసీఏ-17 జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలుకి చెందిన బాలాజీ క్రికెట్ కోచింగ్ (బీసీసీ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఇచ్చిన 88 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో బీకేసీఏ జట్టు చేదించి ఘన విజయాన్ని సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో బీసీసీ జట్టు నుంచి లాంగ్ స్టాండింగ్ పార్ట్నర్ షిప్ తో దత్త శివరాం 23 పరుగులు, విఘ్నేష్ 34 పరుగులు చేసి మంచి స్కోర్ ని నెలకొల్పారు. బీసీసీ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 87/10 పరుగులు సాధించి తమ ప్రత్యర్థి జట్టు అయిన బీకేసీఏ జట్టుకి 88 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా దిగిన గౌతంరెడ్డి, అబుల్ బర్కత్ స్వల్ప స్కోర్ తో ఆటని కొనసాగించారు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ బరిలోకి దిగిన సాయి సాకేత్, అబుల్ లాంగ్ స్టాండింగ్ పర్ఫామెన్స్ తో మంచి స్కోర్ ని నెలకొల్పారు. థర్డ్ డౌన్లో బ్యాటింగ్ బరిలోకి దిగిన గణేష్, సాయి సాకేత్ ల మధ్య మంచి పార్ట్నర్ షిప్ నెలకొని 88/3తో బీకేసీఏ జట్టు విజయ బావుట ఎగురవేసింది. అదేవిధంగా బీకేసీఏ జట్టు నుంచి బౌలర్ అబుల్ నిర్నీత 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్"గా, "బెస్ట్ బౌలర్"గా నిలిచాడు. బీసీసీ జట్టు నుంచి 39 బంతుల్లో 34 పరుగులు సాధించిన విఘ్నేష్ బెస్ట్ బ్యాటర్ గా రాణించాడు. ఈ ట్రోఫీ ఫైనల్స్ లో బీకేసీఏ జట్టు విన్నర్స్ గా నిలవగా, బీసీసీ జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఫైనల్స్ వరకు చేరుకున్న ఇరుజట్లను టోర్నమెంట్ ఆర్గనైజర్లు 50 బాల్స్ క్రికెట్ అకాడమీ ఏపీ జనరల్ సెక్రెటరీ జి. ఆనంద్ బాబు, సహాయ కార్యదర్శి టి.మణికంఠ, బిసౌత్ జోన్ హెడ్ చెన్న ప్రసాద్, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎస్. రవిబాబు అభినందించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం క్రికెట్ అకాడమీ (బీకేసీఏ) కోచ్ పంతంగి సాయి నిరంజన్ మాట్లాడుతూ.. తమ ప్లేయర్స్ చక్కటి ఆటను ప్రదర్శించి ఈ ట్రోఫీని కైవసం చేసుకునేలా కృషి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన వెంట మార్గం నరేందర్, కదిరి నర్సిరెడ్డి ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :