తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడు: మతోన్మాద శక్తులను ఓడించడమే భగత్ సింగ్ కు నేటితరం అందించగలిగే నిజమైన నివాళి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 118వ జయంతి. షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా పిలుపునిచ్చారు.షహీద్ భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం లోని టూ ఇంక్లైన్ దగ్గర ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ నిర్వహించిన పాత్ర యావత్తు దేశం విస్మరించరానిదని, 12ఏళ్ళ అతి చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 23 ఏళ్ళ యువప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించి ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచి దేశ భక్తిని రగిలించిన సమరయోధుడు, విప్లవ మూర్తి భగత్ సింగ్ అని వారు కొనియాడారు. 1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్ సింగ్ 23 ఏళ్ళ చిరు ప్రాయంలోనే 1931 మార్చ్ 23న తన సహచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిపి ఉరితీయబడ్డారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావ శీల విప్లవకారులలో భగత్ సింగ్ అగ్రగణ్యుడని, ఈ కారణంగానే షాహీద్ గా దేశ ప్రజలు కొనియాడారని వారు గుర్తు చేశారు. మతోన్మాద రాజకీయాలను సమూలంగా ఓడించడమే భగత్ సింగ్ కు నేటితరం అందించగలిగే నిజమైన నివాళి అని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యూం ఉపాధ్యక్షులు బరిగెల భూపేష్ జిల్లా కౌన్సిల్ మెంబర్ రసూల్ పాషా, పట్టణ నాయకులు సల్మాన్, మణికంఠ, అప్రోచ్, సంజయ్, జావీద్, అక్షయ్, రవి, రణధీర్, వంశీ, అన్మోల్, అమన్, అష్రాఫ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ