Saturday, 19 September 2026 09:56:02 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” – పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం

Date : 01 April 2026 04:42 PM Views : 335

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : దమ్మపేట మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృత పర్యటన నిర్వహిస్తూ తహసీల్దార్ కార్యాలయం, పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ముఖ్యంగా మధ్యాహ్న భోజన నాణ్యతపై సమగ్రంగా ఆరా తీశారు. మొదటగా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, కార్యాలయంలోని అన్ని విభాగాలను తనిఖీ చేసి, దరఖాస్తుల పరిష్కార విధానంపై అధికారులను ప్రశ్నించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి, కుల ధృవీకరణ, ఆదాయ, నివాస ధృవీకరణ, రేషన్ కార్డుల వంటి దరఖాస్తుల పురోగతిని తెలుసుకున్నారు. దరఖాస్తులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. “మీ సేవ” ద్వారా చెల్లించవలసిన రుసుముల వివరాలను కార్యాలయంలో స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. భూ సమస్యలు, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలు మండల స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉండగా, ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి ఎందుకు దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తోందని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డు రూమ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై, విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, వ్యవసాయం, పోలీస్ శాఖల పనితీరును సమీక్షించారు. గ్రామసభల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేయాలని, వేసవి కాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దమ్మపేట తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించిన కలెక్టర్,ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని నేరుగా పరిశీలించారు. మెనూ ప్రకారం ఆ రోజు చికెన్ బగారా రైస్ అందించాల్సి ఉండగా, అది అందుబాటులో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, మెనూ పాటించకపోవడంపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు అందించవలసిన ఆహారాన్ని ఎందుకు ప్రదర్శించడం లేదని వెంటనే ప్రదర్శించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసిన కలెక్టర్, ఆహార నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” అని ప్రశ్నిస్తూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్మేకర్ కూర సరిగా నువ్వు ఉడక పోవడం , రుచి, నాణ్యత లోపించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారం అందించాలని, భవిష్యత్తులో నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశంలో కుళాయిలకు ట్యాప్‌లు లేకపోవడంతో నీరు వృథాగా పోతున్న పరిస్థితిని గమనించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, అక్కడ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించి కూరగాయలు, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. వంటశాలలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు, భద్రతా చర్యలపై ఆరా తీసి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈఓ జగదీష్, ఉపాధ్యాయురాలు స్టెల్లా, వార్డెన్ దుర్గ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :