తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి.కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నూతన కళాశాల సమితి 23 మంది సభ్యులతో ఏకగ్రీవ ఎన్నిక కళాశాల అధ్యక్ష కార్యదర్శులుగా షేక్ ఇస్మాయిల్ బి నిఖిల్ స్థానిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కళాశాల నూతన నూతన సమితి ని ఎన్నుకోవడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యల పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థులే పోరాడాలని ఏఐఎస్ఎఫ్ సంఘం విద్యార్థి పోరాటాలకు దిక్సూచిగా ఉంటుందని విద్యారంగ సమస్యల పట్ల రాజీలేని పోరాటాలకు విద్యార్థుల సిద్ధం కావాలని కళాశాల సమితి చదువుకుంటూ కళాశాల సమస్యలపై పరిష్కారం వైపు అడుగులు వేయాలని ఏఐఎస్ఎఫ్ సంఘం ఎల్లప్పుడూ శాస్త్రీయ విద్యా విధానానికి దోహదపడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అండగా ఉంటుందని అజిత్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్సు లు గుగులోత్ వంశీ మాణిక్యాల వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ నాయకులు దినేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ