తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పారంపర్య వైద్య మహా సంఘం (పి.వి.ఎం.ఎస్) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల కరపత్రాలను ఎం.పీ. (రాజ్యసభ) సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు. సోమవారం భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని బి.ఆర్.ఎస్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారంపర్య వైద్యులందరూ ఒక తాటి మీదికి రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు.కాగా నిర్వాహకులు వద్దిరాజు రవిచంద్ర కు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్య. రామంచి శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ వైద్య. జి. సుగుణారావు, ప్రకృతి ప్రేమికులు మహమ్మద్ ముస్తఫా, దశరథ్ రజువాలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ