తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ హాజరై, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య రమేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ లు ఇరువురు మాట్లాడుతూ మండల ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రామారావు , ఉపాధ్యక్షులు బాలకిషన్ , గోపాలరావు , యువమోర్చ అధ్యక్షుడు రాంబాబు , సోషల్ మీడియా కన్వీనర్ చరణ్ , ఓబీసీ మోర్చా నాయకుడు నవీన్ జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చలమల విజయ్, అన్నావరుపు జేశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ