Wednesday, 16 September 2026 09:05:59 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సేంద్రియ ఉత్పత్తుల భవిష్యత్తు డిమాండ్ -చరిత ఆర్గానిక్ యూనిట్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 26 November 2025 06:15 PM Views : 243

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం పాల్వంచ మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా యూనిట్‌లో అమలవుతున్న సేంద్రియ పద్ధతులు, కౌజు పిట్టల పెంపకం విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలు, ఉత్పత్తి ప్రక్రియలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. యూనిట్‌లో సేంద్రియ విధానాల్లో తయారుచేసే ఉత్పత్తులు విస్తృతంగా ఉన్నాయి. మునగాకు ఉత్పత్తులు, చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు, ఇప్ప లడ్డు, ఇప్ప నూనె, లెమన్ టీ, కారం పొడులు, పచ్చళ్ళు, హెర్బల్ సోప్‌ల సహా మొత్తం 102 రకాల ఉత్పత్తులు సేంద్రియ పద్ధతిలో తయారుచేసి విక్రయిస్తున్నారు. గ్రామీణ వనరులను వినియోగిస్తూ, సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తులను ఎండబెట్టి, రసాయన రహిత విధానంలో ప్రజలకు అందించడం ప్రత్యేకత. పరిశుభ్రత, ప్యాకేజింగ్, మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ ప్రశంసించారు. యూనిట్‌లో సేంద్రీయ పద్ధతుల్లో ఆరోగ్యకరమైన కౌజు పిట్టల గుడ్లు మరియు మాంసం ఉత్పత్తి చేయడం, స్థానిక మార్కెట్‌లో మంచి ఆదరణ పొందడం కూడా కలెక్టర్ అభినందనీయమని చెప్పారు. పక్షులకు అందించే ఆహార దాన సిద్ధం పద్ధతి, గాలి ప్రసరణ, షెడ్, పరిశుభ్రత చర్యలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేంద్రియ ఉత్పత్తులపై భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దృష్ట్యా సేంద్రియ విధానాలు తప్పనిసరి అవుతున్నాయి అని, కౌజు పిట్టల పెంపకానికి అవసరమైన దానాన్ని బయటి మార్కెట్ నుండి కొనుగోలు చేయకుండా, మొక్కజొన్న పిండి, పల్లి చెక్క వంటి స్థానిక వనరులను ఉపయోగించి సేంద్రియ పద్ధతిలో తయారు చేయడం ద్వారా రైతులకు ఖర్చులను తగ్గించడమే కాక, ఉత్పత్తుల నాణ్యతను పెంచుతుంది, అని సూచించారు. జిల్లా వ్యాప్తంగా కౌజు పిట్టల పెంపకంపై ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి యూనిట్లు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని. భవిష్యత్తులో ఈ యూనిట్ ద్వారా కౌజు పిట్టల పెంపకానికి అవసరమైన దానాన్ని ఇతర గ్రామాలకు సరఫరా చేసే విధానాన్ని పరిశీలించవలసిందిగా సూచించారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో చరిత ఆర్గానిక్ యూనిట్ చైర్మన్ జయ, డాక్టర్ సోమరాజు దొర, యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :