తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 ( తెలుగు వెలుగు ) : గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లో శంకుస్థాపన చేసిన రోడ్డు డ్రైన్ రాళ్ల పై మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు పేరుతో ఉన్న దిమ్మ ను పగలగొట్టి ఇప్పుడు అధికారం లో ఉన్న శాసనసభ్యుల పేరును వేసుకోవడం చాలా బాధాకరం అని బి.ఆర్.ఎస్ నాయకులు నాగబాబు, రమాకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన పనులనూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు గా చూపియటం విడ్డూరంగా ఉంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంత దిగజారిన స్థితిలో ఉందో ఈ యొక్క దిమ్మను చూస్తే అర్థమవుతుంది అని అన్నారు.ఉన్న ఎమ్మెల్యే గారి మెప్పు కోసం తిరిగి అదే దిమ్మపై కొత్త శిలాఫలకం పెట్టిన అధికారులు దీనితో అర్థమవుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పనికిమాలిన ప్రభుత్వమని మీరు ఎన్ని శిలాఫలకాలు మార్చిన ప్రజల గుండెల్లో అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, వనమా అభివృద్ధిని ప్రజల మనసుల్లోకి వెళ్లి చరపలేరూ అధికారులారా రెండు రోజుల్లోగా మీరు ఆ శిలాఫలకాన్ని మార్చరీ యెడల కొత్తగూడెం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతాం అని తెలియచేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ