తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో A-6 నిందితుడు, బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన కేసు వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. కేసు వివరాల ప్రకారం.. నిందితుడు మైనర్ బాలికను కొత్తగూడెం పాత డిపో ప్రాంతంలోని ఒక గదికి తీసుకెళ్లిన సమయంలో, ఆ గదిలో నిందితులకు ఆశ్రయం కల్పించిన A-6 బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి 11.07.2026న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా A-6 నిందితుడు వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ