తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) సభ్యత్వాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,న్యాయవాది యెర్రా కామేష్ మరియు న్యాయవాది పగిడిపల్లి శ్రీకాంత్ లు సోమవారం జిల్లా బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్ నందు ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్ జే.గోపికృష్ణ చేతుల మీదుగా సభ్యత్వాన్ని స్వీకరించారు.ఈసంధర్భంగా యెర్రా కామేష్ మాట్లాడుతూ ఐ.ఎల్.పీ.ఏ వంటి రాజ్యాంగపరమైన విలువలకు ప్రాధాన్యతనిచ్చే సంస్థలో సభ్యత్వం పొందడం గర్వకారణమని, మహాత్మా జ్యోతిరావ్ పూలే, డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆలోచనలు మన సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, వారు ప్రతిపాదించిన సమానత్వం,స్త్రీ,పురుష సమానహక్కులు, నిరుపేదలకు న్యాయానుకూల అవకాశాలు ఇవన్నీ నేడు మరింత అవసరమైన అంశాలని.ఈసిద్ధాంతాల ఆధారంగా న్యాయ సేవలను ప్రజల దాకా తీసుకెళ్లేందుకు,అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించే దిశగా పని చేయడానికి ఐ.ఎల్.పీ.ఏ వేదికగా కృషి చేస్తామని తెలియజేశారు.జిల్లా కన్వీనర్ జే.గోపికృష్ణ వారిని అభినందిస్తూ ఐ.ఎల్.పీ.ఏ సంస్థలో నూతనంగా చేరిన న్యాయవాదులు సమాజసేవ పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయమన్నారు.పూలే–అంబేడ్కర్ మార్గదర్శకత్వంలో సమానత్వం కోసం నిరంతరంగా పోరాడే ఈసంస్థలో వారి భాగస్వామ్యం ఎంతో శక్తినిచ్చే అంశమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మారపాక రమేష్ కుమార్, సభ్యత్వ ఇంచార్జ్ సాధిక్ పాషా, న్యాయవాదులు అంబటి రమేష్, మహిళా న్యాయవాది సరిత, వడ్లకొండ హరిప్రసాద్, కనకం చిన్ని కృష్ణ,ధరావత్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ