తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒడిశాకు చెందిన మహిళతో ఎక్స్రే తీసే క్రమంలో టెక్నీషియన్ శివశంకర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు టెక్నీషియన్ శివశంకర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్ఐ సతీష్ ఈ వివరాలను వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ