Wednesday, 04 November 2026 08:14:54 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

సెప్టెంబర్ 6వ తేదీన కొత్తగూడెంలో గణేష్ నిమజ్జనం ఉత్సవం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్.

Date : 25 August 2025 07:41 PM Views : 720

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి ఏడాది నిర్వహించే వినాయక ఉత్సవాలు ఈనెల 27వ తేదీన ప్రారంభమై వచ్చేనెల 6వ తేదీన నిమజ్జన ఉత్సవంతో ముగుస్తాయని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు తెలిపారు. సోమవారం పట్టణంలోని భజన మందిరం సమీపంలో ఉన్న వివేకానంద హై స్కూల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత ఆ స్థాయిలో ఒక్క కొత్తగూడెంలో మాత్రమే గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, 50 ఏళ్లుగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయని ఈ ఏడాది కూడా ఆ స్థాయిలోనే నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందని వివరించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం హర్షించదగిన పరిణామంగా అభివర్ణించారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా మానవతాదృక్పథంతో వ్యవహరించి మైక్ పెర్మిషన్ కు సంబంధించిన రూ 1500 అనుమతులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని, విచ్చలవిడిగా కనెక్షన్లు ఇవ్వకుండా మండపాల నిర్వహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు, స్థానికులకు, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మండపాలు నిర్మించుకోవాలని, విజ్ఞప్తి చేశారు. గణేష్ నిమజ్జనం రోజున విగ్రహాలతో క్రమశిక్షణగా ప్రకాశం స్టేడియం కు సాయంత్రం 4 గం.లకు చేరుకొని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రగా సూపర్ బజార్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్దకు చేరుకోవాలని చెప్పారు.

పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ యువత భక్తి భావంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. గణేష్ మండపాలకు బ్యానర్లు, జెండాలు, పూజా ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొదమ సింహం పాండురంగాచార్యులు, పలివేల సాంబశివరావు, విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ ప్రధాన కార్యదర్శి గడదేశి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దారా రమేష్, ఉపాధ్యక్షులు మెరుగు చింటేశ్వరరావు, కోశాధికారి వందనపు శ్రీధర్, ప్రచార కార్యదర్శి గుమలాపురం సత్యనారాయణ, కొల్లు పద్మ, సాగర్, సందీప్, పులిగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :