Thursday, 05 November 2026 01:58:11 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

Date : 28 September 2026 07:47 PM Views : 174

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఆపరేషన్‌లో భాగంగా గ్రామంలోని ఇళ్లను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు మరియు నేరాలకు సంబంధించిన అంశాలపై పోలీసులు ఆరా తీశారు. గ్రామంలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి గ్రామస్థులతో మాట్లాడుతూ, ఈ ఏడాది అశ్వాపురంపాడు గ్రామంలో మూడు నేర ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో నేరాలు పునరావృతం కాకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని గ్రామస్థులకు తెలిపారు.అనంతరం గ్రామంలోని చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. పోలీసు శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ప్రజలతో మమేకమై వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తుందని తెలిపారు. గ్రామస్థులు ఎలాంటి సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు , ఎస్సై పివిఎన్ రావు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :