తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాకు మరిన్ని క్రీడా సదుపాయాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనా రెడ్డిని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కోరారు.గురువారం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనా రెడ్డిని హైదరాబాద్ లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్కను బహుకరించారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత పెరిగిందని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఉన్న సదుపాయాలతో పాటు మరిన్ని క్రీడా సదుపాయాలు కల్పించడం మూలంగా గిరిజన జిల్లా అయిన భద్రాద్రి జిల్లా నుండి ఎక్కువ మంది క్రీడాకారులు రాష్ట్రానికి,దేశానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం కలుగుతుందని కోరారు.ప్రతీ జిల్లా కేంద్రంలో 50ఎకరాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని,అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో,అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన,ప్రాతినిధ్యం వహించిన వారిని గుర్తించి వారికి ఔట్ స్టార్సింగ్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తద్వారా ఎక్కువ మంది క్రీడాకారులు జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే అవకాశం కలుగుతుందని కోరినట్టు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ