Saturday, 19 September 2026 01:29:34 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్.

Date : 19 September 2026 11:03 AM Views : 43

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతరత్న అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసి అపహాస్యానికి గురి చేసిన హిందూ మతతత్వ ఉగ్రవాది హమారా ప్రసాద్ అరెస్టు కావడం పట్ల సంతోషంతో భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో స్వీట్లు పంపిణీ!హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి !స్వీట్లు పంపిణీలో పాల్గొన్న ముఖ్య వక్తలు!భారత రాజ్యాంగ సృష్టికర్త భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేస్తూ కల్పిత అంబేద్కర్ అనే పుస్తకాన్ని రాశానని,18 09 2026 నాడు రిలీజ్ చేస్తానని ప్రగల్బాలు పలుకుతూ గత నెల రోజులుగా , ఉద్రిక్తతను ఉత్కంఠతను కొనసాగిస్తూ* సభ్య సమాజంలో మాయని మచ్చగా నిలిచిన,హమారా ప్రసాద్ (ఆవారా ప్రసాదును) అరెస్టు చేయడం శుభపరిణామం అని, అంతటితో సంతృప్తి చెంది, మామూలు సెక్షన్లు పెట్టి అతనిని వదిలివేయకుండా, UAPA_1967చట్టం కింద యావజ్జీవ కారగార శిక్షను విధించి,శాశ్వతంగా జైల్లోనే ఉంచాలని కొత్తగూడెం పాల్వంచల కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జే బి శౌరి , జై భారత్ భీమ్రావు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్, అభ్యుదయ వాది సామాజిక వాది అంబేద్కర్ పూలే వాది మరియు టీజేఎస్ నాయకులు మల్లెల రామనాథం, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్, TEAM రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్,BC సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కురిమెళ్ళ శంకర్ లు ఉద్ఘాటించారు.18 09 2025 నాడు స్థానిక అంబేద్కర్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్దభారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో హమారా ప్రసాద్ (ఆవారా ప్రసాద్) అరెస్టుపై హర్షాతిరేకాలతో స్పందిస్తూ స్వీట్లు పంపిణీ చేసుకొని ఒకరికొకరు సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ ఇటువంటి మత కుల విద్వేషక చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని,బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిష్టను, భారత రాజ్యాంగాన్ని అప్రతిష్ట పాలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మేము కోరినంతనే ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సృష్టికి తీసుకువెళ్లి, సమస్య తీవ్రతను, హమారా ప్రసాద్ అరెస్టు యొక్క ఆవశ్యకతను చర్చించిన దళిత జాతుల ఆశాజ్యోతి, అంబేద్కర్ ఆశయాల వారసుడు తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి గనులు మరియు పరిశ్రమల శాఖ మాత్యులు అన్న గౌరవనీయులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, నిరంతర అభివృద్ధి సాధకులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావుకి ఆచార్య డాక్టర్ మద్దెల హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. తొలుత భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్య అతిథులు అందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలి అనే నినాదాలు ఇచ్చారు. ఈ స్వీట్లు పంపిణీ కార్యక్రమానికి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సభాధ్యక్షుత వహించగా అపరబాలు అల్లి శంకర్ వందన సమర్పణ చేశారు. ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆలపించిన ఉద్వేగ భరిత గీతం" జాగురవ్వ జాగోరే జాగో జాగో అందరినీ ఉత్తేజపరిచింది.అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని మరియు స్వీట్లు పంపిణీ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.ఆద్యంతం అందరినీ అలరించిన ఈ కార్యక్రమంలో, మూడ్ గణేష్, పసుపులేటి వీరబాబు, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, నాగ సీతారాములు, జేబీ శౌరి, ఎర్రా కామేష్, మల్లెల రామనాథం, సలిగంటి శ్రీనివాస్, దాసరి రమేష్, కురిమెళ్ళ శంకర్ లతోపాటు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంతోటి పాల్, అంబేద్కర్ సంఘం BC వెల్ఫేర్ రాష్ట్ర నాయకులు పి సురేందర్ ,అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దాల మహేష్, AIYF జిల్లా నాయకులు జర్పుల ఉపేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తిని రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ మరియు అంబేద్కర్ సంఘ నాయకులు ఎం పురుషోత్తం భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాళ్లు కె మునీల రాజ్, బడికల పుష్పలత, బద్దం స్వర్ణలత, ఇంకా సామాజిక అభ్యుదయవాదులు, వివిధ సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘ రాష్ట్ర మైనార్టీ నాయకులు సల్మాన్ ఖాన్ తోత , అంబేద్కర్ సంఘ జిల్లా నాయకులు జె రాజేశ్వరరావు,TEAM నాయకులు శెట్టి కమలాకర్, అంబేద్కర్ సంఘ నాయకులుసూరం వరప్రసాద్, రామిళ్ళ మధుబాబు, ఇల్లంగి తిరుపతి, అంతటి రాజు, టి సువర్ణ బాబు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వి అనిల్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు మద్దెల ఆదర్శ్, ప్రధాన కార్యదర్శి కేదాసి కిరణ్, వంశీ, రమేష్, మహేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :