తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (న్యాయవిభాగం): కొత్తగూడెం స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు పై ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని కొత్తగూడెం నియోజకవర్గం లోని ఒక వ్యాపారస్తుడితో కొందరు కుట్ర దారులు కూనంనేని గెలుపును జీర్ణించు కోలేనివారు వేసిన ఎన్నికల పిటిషన్ తెలంగాణ హైకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. ఎన్నికల పిటిషన్ డిస్మిస్ చేసిన వార్త తెలియగానే కొత్తగూడెం కోర్టులోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) న్యాయవాదులు వర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలను పంపిణీ చేశారు. సోమవారం కొత్తగూడెం కోర్టు ఆవరణలో జరిగిన స్వీట్ల పంపిణీ సోమవారం అనంతరం ఐఏఎల్ నాయకులు బార్ అసోసియేషన్ కార్యదర్శి భాగం మాధవరావు, కోటంరాజు, మునిగడప వెంకటేశ్వర్లు,ఉప్పు శెట్టి సునీల్ లు మాట్లాడుతూ నిజం నిప్పులాంటిదని, నిజం ఎప్పటికీ విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కూనంనేని పై ఎన్నికల పిటిషన్ వేయడం ద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టేనని అన్నారు. వారికి ప్రజలు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లేనని ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఈ కేసును వాదించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్, ఐ ఏ ఎల్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ మరియు ఈ కేసులో సహాయ సహకారాలు అందించిన ఐ ఏ ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమోలు ఉదయ భాస్కర్ రావు, రమేష్ కుమార్ మక్కాడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ