Thursday, 17 September 2026 04:39:55 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కిన్నెరసాని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 23 December 2025 06:07 PM Views : 371

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కిన్నెరసాని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఏరు రివర్ ఫెస్టివల్‌లో భాగంగా మంగళవారం ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామం నుండి మొతలగూడెం వరకు కిన్నెరసాని రివర్ వాక్ కార్యక్రమాన్ని విజజయవంతంగా నిర్వహించారు. ఉదయం 8.00 గంటలకు ప్రారంభమైన ఈ రివర్ వాక్‌లో యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని, కిన్నెరసాని నది పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, నదుల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్వయంగా, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, యువతతో కలిసి రివర్ వాక్‌లో పాల్గొని వారితో మమేకమయ్యారు. నది తీర ప్రాంతాల వెంట సాగిన ఈ వాక్ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలు, కిన్నెరసాని నది పరిసర ప్రాంతాల సహజ సంపద, అలాగే జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను యువతకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాలు, నదులు, జలపాతాలు, ప్రకృతి వనరులు పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను యువతకు వివరిస్తూ రివర్ వాక్ కార్యక్రమం ముందుకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కిన్నెరసాని నది జిల్లా జీవనాధారంగా ఉండటంతో పాటు పర్యావరణ సమతుల్యతకు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నది చుట్టూ ఉన్న పచ్చని అడవులు, సహజ వనరులు, జీవ వైవిధ్యం భవిష్యత్ తరాలకు కాపాడాల్సిన అమూల్యమైన సంపద అని తెలిపారు. ఈ ప్రకృతి సౌందర్యాన్ని సంరక్షించుకుంటూనే దేశ విదేశాలకు పరిచయం చేస్తే జిల్లాలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏరు రివర్ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం జిల్లాలోని నదుల, పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రవాణా, స్థానిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు. యువత సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా కిన్నెరసాని నది ప్రకృతి అందాలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి తెలియజేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫోటోగ్రఫీ, వీడియోలు, డాక్యుమెంటరీలు, రీల్స్, బ్లాగుల ద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా కృషి చేయాలని సూచించారు. అదే సమయంలో నదులను కాలుష్యరహితంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి యం. పరంధామ రెడ్డి, స్థానిక అల్లపల్లి మండల ఎంపీడీవో శ్రీను, తహసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, ఎంఈఓ సంతా రావు, కృష్ణయ్య, గ్రామ సర్పంచ్ చిన్న పాపయ్య, పంచాయతే సెక్రెటరీ వరుణ్, టి ఎన్జీవోస్ ఉద్యోగ సంఘాల నాయకులు భార్గవ్ చైతన్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ మహిధర్, నాగేంద్ర, ఆర్చెరీ కోచ్ కల్యాణ్, సైకిలింగ్ నాగేశ్వర రావు, ఉదయ్ కుమార్, టైక్వాండో రమేశ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్థానిక యువత, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :