తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 21 తెలుగు వెలుగు) : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను భారతీయ జనతా పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు భూక్య రమేష్ నిరుపేద మహిళలకు అందజేశారు. మండల పరిధిలోని పడమటి నరసాపురం, దండు మెట్ట తండా, కొమ్ముగూడెం, బేతాలపాడు, మాచినేని పేట గ్రామానికి సంబంధించిన 50 కుటుంబాలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేశారు. ఉచిత గ్యాస్ సామాగ్రి పొందిన మహిళా లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ పథకం తమ కుటుంబ జీవితాల్లో మంచి మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు మహిళల ముఖాలలో ప్రత్యేకమైన సంతోషం కనిపించగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామారావు, యువ మోర్చా అధ్యక్షుడు రాంబాబు, ఉపాధ్యక్షుడు బాలకిషన్, కార్యదర్శి బాబూలాల్, సోషల్ మీడియా కన్వీనర్ చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ