తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిందని జిల్లా అధ్యక్షుడు రాజేష్ నాయక్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలో సంఘం 29వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. తండాలు ప్రత్యేక గ్రామపంచాయతీ, ఎస్టీలకు 10% రిజర్వేషన్ సాధించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన ఠాను నాయక్ జీవితాన్ని గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ