Thursday, 17 September 2026 07:03:41 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్ – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 11 November 2025 04:42 PM Views : 351

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత రత్న, భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ 137వ జయంతి, మైనార్టీల సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తో కలిసి హాజరై మౌలానా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సేవలు అపారమని అన్నారు. ఆయన భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యా విధానానికి పునాది వేయడంతో పాటు పేద, వెనుకబడిన వర్గాల పిల్లల విద్యకు మార్గం చూపారని వివరించారు.మౌలానా ఆజాద్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, విద్యావేత్తగా దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గం నేటికీ విద్యావేత్తలకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.దేశం మరియు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాన్ని అభివృద్ధి దిశగా నడిపించుకోవాలని సూచించారు.ప్రస్తుతం భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్నారంటే, దానికి పునాది మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చూపిన విద్యా దార్శనికతేనని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి సంజీవరావు, బీసీ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, ఐడిఓసి అధికారులు, సిబ్బంది మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :