తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 23(తెలుగు వెలుగు)జూలూరుపాడు మండల పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది . జూలూరుపాడు మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించేలాగా కృషి చేయగలరు. అదేవిధంగా అటు ఖమ్మం వెళ్లాలన్న ఇటు భద్రాచలం వెళ్లాలన్న బస్ కోసం ఎదురుచూసే సమయంలో బస్ షెల్టర్ లేక ఎర్రటి ఎండైనా ఎంతటి వర్షమైనా ఎండకు ఎండుకుంటూ వర్షానికి తడుస్తూ బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. రోడ్డుకు ఇరువైపులా బస్ షెల్టర్ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కావున తక్షణమే మండలం కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ ,బస్సు సెంటర్లు నిర్మించడానికి ఖమ్మం రీజినల్ మేనేజర్ కి మీ ద్వారా లెటర్ అందేలాగా కృషి చేసి సమస్యను పరిష్కార దిశగా అడుగులు వేయాలి అంటూ కొత్తగూడెం ఆర్టిసి సూపర్డెంట్ కు వినతి పత్రం అందించిన భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు ఆధ్వర్యంలో అందించడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ