తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, వడదెబ్బ ప్రమాదంపై ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మనోజ్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరియు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ