Thursday, 17 September 2026 11:59:27 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

వినియోగదారుల హక్కులను కాపాడాలి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.

Date : 24 December 2025 08:46 PM Views : 301

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వినియోగదారులు రాయితీలు, ఉచిత ప్రకటనలను ఆన్లైన్లో చూసి మోసపోవద్దు అన్నారు. ఇలాంటి మోసాలను హ్యాకర్లు గుర్తించి దోచేస్తారని, పాస్వర్డ్లను సులువుగా పెట్టుకోవద్దని, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. కొనుగోలు చేసిన వస్తువు తయారీ, చిరునామా, గడువు తేదీ మరియు కస్టమర్ కేర్ నెంబర్ ను సరి చూసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ మరియు మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు విత్తనాలు, మందులు కొనేటప్పుడు బోగస్ కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి తమకు జరిగిన నష్టాన్ని తిరిగి పొందవచ్చు అని తెలిపారు. వినియోగదారులు తూకాలలో మోసపోవద్దని వస్తువు కొనుగోలు లో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు కొలతలు పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకొని లైసెన్స్ తీసుకోవాలని అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచుగా రెస్టారెంట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.వినియోగదారుల హక్కులను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, పౌరసరపరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మరియు వాలంటరీ ఆర్గనైజర్స్ జూలూరి రఘు రామాచారి, తెలంగాణ కన్జ్యూమర్ సెయింట్ ఇన్ఫర్మేషన్ రైడ్స్ అవేర్నెస్ ఫోరం గుగులోతు బాలు, కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు మహమ్మద్ రియాజ్, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యులు శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :