తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డ్రైనేజీ కాలువలు, మోరీలు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే డెంగీ వ్యాధి నివారణ సాధ్యం డాక్టర్ తుకారం రాథోడ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. మే 16 వ తారీకు ప్రపంచ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ రామదాస్ ఆధ్వర్యంలో స్థానిక సులా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందితో అవగాహన ర్యాలీ, మానవహారం మరియు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ హాజరయ్యి ప్రజలకు సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ మానవ మరణాలు అత్యంత చిన్న కీటకమైన దోమకాటు ద్వారా సంభవిస్తున్నాయని ఇది అత్యంత బాధాకరమైన విషయమని,ఇంటి పరిసరాలలో ఎటువంటి నీటి నిల్వలు లేకుండా చేసుకుని ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే విధిగా పాటిస్తూ దోమ పుట్టకుండా దోమ కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి మీద ఉందని గ్రామాల్లోని డ్రైనేజీల్లో మోరీల్లో ప్రజలు నిర్లక్ష్యంగా చెత్తాచెదారం వేయడం ద్వారా మురుగునీరు సక్రమంగా ప్రవహించకుండా నీటి నిల్వలు పేరు కొనిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని మురుగునీరు ప్రవహించే కాలువల్లో మోరీలో చెత్త వేయడం ప్రజా ఆరోగ్య రక్షణ చట్టంలో నేరపూరితమైన చర్య అని దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు అలాగే నీటి ట్యాంకులు డబ్బాలు మూతలతో మూసి ఉంచాలని, రాత్రి పూట దోమతెరలు వినియోగించాలని, గృహాలకు దోమ జాలీలు అమర్చుకోవాలని, నిండుగా బట్టలు ధరించాలని దోమల నివారణ కోసం అన్ని రకాల చిట్కాలు చేయడం ద్వారా దోమకాటు ద్వారా వచ్చే డెంగీ,మలేరియా, బోధకాలు మెదడు వాపు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని డెంగ్యూ లక్షణాలైనా విపరీతమైన జ్వరం, తలనొప్పి,చలి, వణుకు, ఒళ్లు నొప్పలు, వాంతులు, అలసట ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని కోరారు మన సంకల్పం -డెంగీ రహిత భారత్ అని, మన చర్యలు, మన రక్షణ ఆరోగ్యకరమైన కుటుంబం - సురక్షితమైన సమాజం అని, డెంగీ రాకుండా ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని డెంగీ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేశ్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ కుమారస్వామి,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, CC రాంప్రసాద్,డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గన్య పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ చంద్రకళ, సభ్ యూనిట్ ఆఫీసర్ జాబిశెట్టి శ్రీనివాస్ సూపర్వైజర్లు గుజ్జా విజయ కౌసల్య సింగ్, నాగుబండివెంకటేశ్వర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు హారిక ధరణి రుక్సానా, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, ఫార్మసీ ఆఫీసర్ కిరణ్ కుమారి, దనసరి రాంబాబు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ