తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరుకాకుండా ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి సమస్యను పరిష్కరించకుండా ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు ముందస్తు అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. “మమ్మల్ని అరెస్ట్ చేయగలరు… కానీ విద్యార్థుల గొంతును అరెస్ట్ చేయలేరు. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ చేస్తున్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరు” అని శీలం విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, విద్యార్థుల చదువుకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదు!
Admin
తెలుగు వెలుగు టీవీ