తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2 రోజుల కిందట మేకలు కాసేందుకు వెళ్లి కనిపించకుండా పోయిన యువతి కాలువలో విగతజీవిగా కనిపించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉల్వనూరుకు చెందిన పల్లపు శిరీష (19) మేకలు కాసేందుకు శుక్రవారం వెళ్లి తిరిగి రాకపోవడంతో శిరీష తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆదివారం అటవీ ప్రాంతంలో పోలీసులు గాలిస్తుండగా రాళ్లవాగులో శిరీష మృతదేహం లభ్యమైందని ఎస్ఐ సురేష్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ