తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక పాల్గొని పతాకం ఆవిష్కరించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం టౌన్ రామవరం ప్రాంతంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రామవరం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ దిమ్మె వద్ద జాతీయ పతాకాన్ని మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం టూ ఇంక్లైన్ ఏరియాలో రామవరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆవిర్భావ వేడుకకు హాజరయ్యారు. సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట గల తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రగతి మైదానంలో గల అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అణిచివేతను నీళ్లు నిధులు నియామకాల దోపిడి పై నాడు కేసీఆర్ ఉద్యమం ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఏ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి 14 ఏళ్లపాటు కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అనంతరం పదేళ్లపాటు అధికారం చేపట్టి తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు 420 అసత్యపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ కలల తెలంగాణను విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనపట్ల అసహనంతో ఉన్నారని, వచ్చేది గులాబీ జెండా ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి, గడప రాజయ్య కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మండల అధ్యక్షులు హుస్సేన్, మోరే పార్వతి,విజయలక్ష్మి, రామవరం పట్టణ అధ్యక్షులు మాజీ గౌస్,చంద్రయ్య, సూరిబాబు సురేందర్,అశోక్, రాచపల్లి శీను, ఖాజా బక్ష, నగేష్, అన్వర్ కాజా, షమ్మీ, రాజేందర్, పూర్ణ చందర్రావు,లచ్చిరాం, మనోజ్, పాషా,రాజేష్, కిరణ్, సాగర్,కొయ్యడ శ్రీనివాస్ ప్రసాద్, సాగర్, అమన్, షణ్ముఖ్, షోహల్, చాణక్య ప్రసాద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ