Saturday, 19 September 2026 05:51:24 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మణుగూరు మున్సిపాలిటీలో నక్ష సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 08 June 2026 06:29 PM Views : 172

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నక్ష పైలట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు భూముల రీ-సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్రంలో వివాదాలు లేని పారదర్శక భూపరిపాలన వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిజిటల్ సర్వే కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్టులకు ఎంపికైన జిల్లాల్లో సర్వే మరియు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో రోవర్ పరికరాల ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఆస్తులకు ఖచ్చితమైన సర్వే చేపట్టి, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని మణుగూరు మున్సిపాలిటీ ఎంపికైందని తెలిపారు. ప్రాజెక్టు అమలులో భాగంగా సర్వే మరియు రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ శాఖ ద్వారా ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 రెవెన్యూ వార్డులు ఉండగా, వాటిని 97 బ్లాక్‌లుగా విభజించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 7,524 ఆస్తులను గుర్తించడం జరిగిందని, వాటిలో 5064 ఆస్తుల సర్వే పూర్తయిందని చెప్పారు. అలాగే 2,074 ఆస్తులకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. నక్ష ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు పారదర్శకమైన భూ రికార్డులను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పనిచేస్తున్నాయి అని తెలిపారు . ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏడి సర్వే శ్రీనివాస్,మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :