తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రీ - సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్.ఐ.డీ.ఓ.సీ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో తాహసిల్దార్లు, సర్వేయర్లతో సమీక్షా సమావేశం. ద్రాద్రి జిల్లాలో భూ రీ - సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం జిల్లాలోని ఐ.డీ.ఓ.సీ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ,డీ.ఆర్.ఓ పద్మావతి,సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి మండల తాహసిల్దార్లు, సర్వేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూములకు సంబంధించి పాత రికార్డుల పైనే ఇప్పటికీ ఆధారపడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టంను తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని , భూ సమస్యల శాశ్వత పరిష్కారంలో భాగంగా రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ సర్వే అండ్ బౌండరీ చట్టం ప్రకారం రీ - సర్వే నిర్వహించడం జరుగుతుందని, చట్టం గురించి అవగాహన కలిగి ఉండి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని తాహసిల్దార్లను ఆదేశించారుఎనిమిది నియంత్రణ దశలలో ఈ సర్వే జరుగుతుందని, చట్టబద్దత, సంబంధిత అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి తాహాసిల్దార్, సర్వేయర్ల నుంచి ఇప్పటివరకు సర్వే జరిగిన వివరాలను నివేదిక అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిని త్వరితగతిన చర్యలు చేపట్టాలని తహసీల్దార్ లను ఆదేశించారు. గ్రామసభల ద్వారా పట్టదారులకు సమాచారం అందించాలని, మొదట గ్రామసభ నిర్వహించి సంబంధిత ప్రజలకు సమాచారం అందించి గ్రామ సరిహద్దును నిర్ణయించాలని, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ సంబంధిత భూములను సాధారణ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, జి.పి.ఓ.ల ఆధ్వర్యంలో గుర్తించాలని తెలిపారు.తదుపరి సర్వే బృందంతో పాటు రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేసి సర్వే నిర్వహించడం, సర్వే సమయంలో ఖచ్చితంగా ఫీల్డ్ రిజిస్టర్ నిర్వహించాలని, తద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కరణ సులభతరం అవుతుందని తెలిపారు. ప్రతి బృందం లక్ష్యానికి అనుగుణంగా సర్వే పనులను పూర్తి చేయాలని, అవసరమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. సర్వే, కొ- రిలేషన్ స్టేట్మెంట్ తయారీతో పాటు నోటీసుల జారీ ప్రక్రియను ఏకకాలంలో చేపట్టాలని, రైతులకు నోటీసులు సకాలంలో అందజేయాలని, రీ - సర్వే ప్రక్రియపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.గ్రామాల హద్దుల నిర్ధారణకు సంబంధించిన సమాచారం సర్పంచులు, రైతులకు అందించాలని, రీ - సర్వే ప్రక్రియలో ప్రజల సహకారం తీసుకుని పారదర్శకంగా పనులను పూర్తి చేయాలని తెలిపారు. రీ - సర్వేకు సంబంధించి ఫారాలు అందుబాటులో ఉన్నాయని, నిబంధనల ప్రకారం సక్రమంగా పూర్తి చేసి రికార్డులను సిద్ధం చేయాలని సూచించారు. రీ-సర్వే పనులపై తహసిల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.జి.పి.ఓ.లు భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను సక్రమంగా సిద్ధం చేసి, రీ - సర్వేకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో తహసిల్దార్ కార్యాలయాలలో సీలింగ్ డిక్లరేషన్ను పరిశీలించి, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు.అదేవిధంగా భూభారతి దరఖాస్తులలో భూమి విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ లకు సూచనలు చేశారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణీ దరఖాస్తుల వంద శాతం పరిష్కరాం అయ్యేలా పనిచేయాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఆ దిశగా మండల ఎంపీడీవోలు సహకారంతో తాహసిల్దార్లు పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్నీ మండల తహసిల్దార్లు,సర్వేయర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ అంకిత్. భద్రాద్రి జిల్లాలోని 22 మండలాల ఎంపీడీవోలతో సోమవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అంకిత్ ఇందిరమ్మ గృహాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు, నిలిచిపోయిన నిర్మాణాలు, స్లాబ్ దశలోనే ఆగిన నిర్మాణాలపై ఎంపీడీవోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎటువంటి సాంకేతిక సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీ.ఈ.వో నాగలక్ష్మి,డీ.పీ.ఓ అనూష, హౌసింగ్ పీడీ సవయ్ రామ్, వివిధ మండలాల ఎంపీడీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ