తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈరోజు 132వ బూత్‌లో పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కల్చరల్ కన్వీనర్ ఆదిమూల రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున కృషి చేయడంతో పాటు, బూత్‌ల వారీగా పట్టభద్రుల ఓటర్లను గుర్తించి, అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు నోముల రమేష్, కనుకుంట్ల రాజమొగిలి, పట్టణ కార్యదర్శి చంద్రగిరి రమేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు పూర్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు యామిని, నాయకులు బండి భాస్కర్, జగదీష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ