తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు పోలీసు వారి ఆధ్వర్యంలో నాలుగు మండలాల(జూలూరుపాడు, చండ్రుగుండ, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్) క్రికెట్ స్థాయి టోర్నమెంట్ పోటీలు జరగనున్నాయి. జూలూరుపాడు మెయిన్ రోడ్ పక్కన 2-12-24 నుండి 10-12-24 వరకు జరుగును. ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లు ఎటువంటి ఎంట్రీ ఫీజులు కట్టనవసరం లేదు. ఈ పోటీలో గెలిసినటువంటి జట్టుకు మొదటి బహుమతి 20వేల రూపాయలు మరియు షీల్డ్, ద్వితీయ బహుమతి 15 వేల రూపాయలు మరియు షీల్డ్, తృతీయ బహుమతి 10వేల రూపాయలు మరియు షీల్డ్. పోటీలో పాల్గొన దలచిన క్రీడాకారులు డిసెంబర్ ఒకటో తారీకు లోపు క్రింద జతపరిచిన cell నెంబర్లకు 8712508673 సురేష్ , 9110 321254 రామకృష్ణ, 9912848427 సిద్దు,జట్టు వివరాలను పంపించవలెను. క్రీడాకారులకు గమనిక ఈ టోర్నమెంట్ లో నియమ నిబంధనలు ఏ మండలం క్రీడాకారుడు ఆ మండలంలోని ఆడ వలెను, క్రీడాకారుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్య అతిథులుగా ఎస్పి రోహిత్ రాజ్, డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్ పాల్గొంటారు.
Admin
తెలుగు వెలుగు టీవీ