తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విష జ్వరాల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ,విష జ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వ వైద్యాధికారులు విఫలమవుతున్నారని మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు విష జ్వర పిడుతుల పట్ల వైద్యాధికారులు అలసత్వం వీడి తక్షణమే వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం పదో వార్డులో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వ వైద్యులకు విజ్ఞప్తి చేశారు . ఈ సమావేశంలో మేడిపల్లి కవిత ,రావిశెట్టి పద్మ ,రాజేశ్వరి నాయకులు వాసం బాబు, ఉపతల శీను ,సందీప్ ,అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ