తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : ఇటీవల వచ్చిన మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఖమ్మం నగరంలోని దంసలాపురానికి చెందిన చింతల ఉపేందర్ (53) ఇల్లు మున్నేరు వరదల్లో మునిగింది. ఇంటిలో సామాగ్రి పూర్తిగా కొట్టుకుపోయాయి. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ