తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆగష్టు 11తెలుగు వెలుగు) కేంద్ర ప్రభుత్వ రైతాంగా, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు జూలూరుపాడు లో భానోధర్మ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమవేశంలో సిపిఐ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద,న్యూడెమోక్రసీ, మండల కార్యదర్శులు,గుండె పిన్ని వెంకటేశ్వర్లు బానోతు ధర్మ, వల్లోజీ రమేష్ లు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సు0ఖాలు విధిస్తామని మరియు రష్యాతో వ్యాపార ఒప్పందానికి శిక్షాత్మక పన్నులు వేస్తామని ఇటీవల చేసిన హెచ్చరికలను తీవ్రంగా ఖండించారు.అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఒకపక్క సలాం కొడుతున్న నరేంద్ర మోడీ మరో పక్క భారత దేశంలో అమిత్ షా,ఆదాని, కార్పొరేట్ శక్తులు నూతన చట్టాలను తీసుకువచ్చి కార్మిక వ్యవసాయ రంగాలను ప్రైవేటుపరం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని వారు అన్నారు. ప్రభుత్వం తన కార్పొరేట్ అనుకూల ఎజెండా గా తెచ్చిన నాలుగు కార్మిక కోడులను రద్దు చేయాలని మరియు రుణమాఫీలను నిరాకరిస్తూ కొనసాగిస్తుంది కార్పొరేట్ లాభాల కోసం ప్రజలు జంగిల్ జమీన్ ఆడవుల పై వినాశకరమైన దాడిని ప్రభుత్వం కొనసాగిస్తుంది.చట్టాలను ఉపయోగించి ప్రభుత్వ అభివృద్ధి పేరుతో బలవంతంగా భూసేకరణ కొనసాగిస్తుంది పర్యావరణాన్ని నాశనం చేస్తుంది ప్రభుత్వాలే పర్యావరణాన్ని నాశనం చేస్తూ మరోపక్క ఆదివాసీలను పర్యావరణం పేరుతో అడవు ల నుండి గెంటివేస్తున్నారని వారు అన్నారు. ట్రంపు సుంకాలను కార్పొరేట్ దోపిడిని నూతన ఎంఎస్పి చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని అందులో భాగంగానే ఆగస్ట13న బ్లాక్ డే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు జి వెంకటేష్ సీతారాం ,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ