తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పోరాటాల ద్వారానే పేదల సమస్యలు పరిష్కారం. పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి.ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం సాగించాలి.సభ్యత్వ నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి.గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి.ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమే.భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా ఉద్యమాలను ఉధృతం చేయాలి.కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. ప్రజా పోరాటాల ద్వారానే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ దిశగా పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి మండల కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రజల పక్షాన ఉండి పోరాటాలు నిర్వహించడంలో సిపిఐ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అత్యంత త్వరితగతిన పూర్తి చేసి, గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని నిర్దేశించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరిన్ని ఉద్యమాలు చేపడతామని, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని ఆయన కోరారు. సమావేశాల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, జూలూరుపాడు మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్ రావు, చండ్రుగొండ మండల కార్యార్షి బొర్రా కేశవరావు, అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి ఊకే నారాయణ, జిల్లా సమితి సభ్యులు నాగుల్ మీరా, జడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ