తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వారానికి ఒకరోజు శ్రమదానం చేద్దాం !మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం! అగరోగ్యాన్ని కాపాడుకుందాం !అని పదో వాడు కౌన్సిలర్ పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్వచ్ హి సేవ మూడవరోజు కార్యక్రమంలో భాగంగ లక్ష్మీ టాకీస్ ఏరియా లోని కోటి వృక్షాల్లో అలాగే ఓపెన్ జిమ్ లో శ్రమదానం నిర్వహించి ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారానికి ఒక్కరోజు మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు అని అన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పటంలో మనం భాగస్వామ్యం కావచ్చు అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంటింటి కెళ్ళి హౌసుల్లో, కొబ్బరిచిప్పల్లో, టైర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి డ్రై డే ,ఫ్రైడే నిర్వహించారు .ఈ కార్యక్రమంలో హెల్త్ సి ఓ శ్రీనివాస్, ఆర్పి కవిత, మరియు ఆశా వర్కర్లు భవాని, రాజమణి ,సమైక్య గ్రూప్ సభ్యులు హేమలత ,రాజేశ్వరి ,వెంకటలక్ష్మి, శానిటేషన్ సిబ్బంది శాంత ,సందీప్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ