Wednesday, 16 September 2026 06:12:01 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

‘ కార్మికుల భీమా పెంపు’ గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 24 November 2025 06:06 PM Views : 253

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన భీమా పెంపు వివరణలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐ డి ఓ సి కార్యాలయం లో ‘కార్మికుల భీమా పెంపు’ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు మరియు అనుకోని మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా భీమా మొత్తం పెంపు ఒక చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సమాజమరణ భీమాను రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు, ప్రమాద మరణ భీమాను రూ.6 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 16.50 లక్షల కార్మికులు లబ్ధి పొందనున్నారని వివరించారు. భీమా ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండేందుకు కార్మిక శాఖ, బీమా సంస్థలు మరియు బోర్డులు సమన్వయంతో వేగంగా సేవలను అందించాలని అధికారులకు సూచించారు. భీమా క్లెయిమ్ విధానం, అవసరమైన పత్రాలు, అర్హతలు, టోల్‌ఫ్రీ నంబర్లు వంటి సమాచారాన్ని గ్రామ స్థాయి వరకు విస్తృతంగా చేరేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కార్మిక కుటుంబాలు ఏ కష్టకాలంలోనైనా ఆర్థికంగా కూలిపోకుండా రక్షించేందుకు ఈ భీమా పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :