Friday, 18 September 2026 12:32:22 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 30 September 2025 08:02 PM Views : 298

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు రెండవ సాధారణ ఎన్నికలు (జడ్పిటిసి, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ) నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలన్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపధ్యంలో, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు మరియు ఎన్నికల నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల నమోదు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించి ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాలో జరిగే రాజకీయ సమావేశాలు, సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల పంపిణీ, వీఐపీలు పాల్గొనే బహిరంగ సభలు తదితర కార్యకలాపాలు నిషితంగా పరిశీలించబడతాయని, వాటికి అయ్యే ఖర్చులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థి ఖాతాలో నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారురాజకీయ పార్టీలు ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ముద్రణలు చేయరాదని, ఎన్నికల ఫ్లెక్సీలపై ముద్రిస్తున్న వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులు తప్పనిసరి అన్ని పార్టీలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థనా స్థలాలలో రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, ఎన్నికల నిర్వహణపై వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిప్యూటీ జెడ్పీ సీఈవో కొండూరు చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అజ్మీర సురేష్, భారతీయ రాష్ట్ర సమి తి అనుదీప్, సిపిఐ పార్టీ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నోముల రమేష్, సిపిఐ ( ఎం) సత్యనారాయణ మరియు సిపిఐ ( ఎం సి ) గౌరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :