తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి.బహుజనులకు విద్యను దూరం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. రాష్ట్రంలోని పేద,బడుగు,బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.మండలంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు ఈబకాయిల సమస్య తీవ్ర ఆటంకంగా మారిందన్నారు.ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండివైఖరి అవలంబిస్తూ,విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమడుతున్నారని మండిపడ్డారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ దీక్షలు చేయడం మానేసి ఢిల్లీలో దీక్షలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సుమారు రూ.1,500 కోట్లు విడుదల చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు.బీజేపీ నేతలు "ఫీజు బకాయి బీజేపీ లడాయి" అంటూ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ,గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..ఈ మూడు పార్టీలు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.బహుజనులు ఉన్నత విద్యను అభ్యసించడం ఈ పార్టీలకు ఇష్టం లేదని,విద్యను బహుజనులకు దూరం చేయడమే వాటి లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.బహుజన విద్యార్థుల విద్యా హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని యెర్రా కామేష్ పిలుపునిచ్చారు.ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని,లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన జేబీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో జేబీపీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,వినయ్,సోనూ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ