Monday, 02 November 2026 10:58:45 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

“యూరియా అధిక వినియోగం తగ్గించాలి – భూసారాన్ని కాపాడుకోవాలి” – కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 04 May 2026 09:13 PM Views : 272

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లి మండలంలోని ప్రశాంత్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమాల తొలి రోజు విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. రైతులు అధిక మోతాదులో యూరియా వినియోగం చేయడం వల్ల భూసారం దెబ్బతిని భూమి ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల యూరియా వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పంట మార్పిడి పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని, ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల భూసారం క్షీణిస్తుందని తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సాంకేతిక సూచనలు రైతులు అనుసరించాలని సూచించారు.ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా భూమి ఆరోగ్య సంరక్షణ మరియు భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. భూసార పరీక్షలు చేయించిన రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందజేసి, వాటి వినియోగం, ప్రయోజనాలను వివరించారు. పంటల వారీగా ఎరువులను సరైన మోతాదులో, సరైన సమయంలో వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు.పంటలకు అవసరమైన పోషకాలు (మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్స్) గురించి రైతులకు అవగాహన కల్పించారు. సహజ వ్యవసాయం విధానాలు, వాటి ప్రయోజనాలపై వివరాలు అందించారు. రాబోయే వానాకాలం సీజన్‌కు అనుగుణంగా సన్న రకాల వరి వంగడాలు మరియు వాటి సాగు పద్ధతులపై కూడా రైతులకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా “రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, శాస్త్రవేత్తలు గ్రామ స్థాయిలో రైతులకు నేరుగా చేరుకుని ఎరువుల యాజమాన్యం, యూరియా వినియోగం తగ్గింపు, భూసార పరీక్షల ప్రాముఖ్యత, పంట మార్పిడి విధానాలు మరియు లాభదాయక పంటల సాగుపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు మాట్లాడుతూ, జిల్లాలోని 67 రైతు వేదికల్లో మే 4వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం మరియు వానాకాలం పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని వివరించారు.ఈ రైతు వారోత్సవాల ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ , డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, స్థానిక సర్పంచ్, జెడి హార్టికల్చర్, జిల్లా హార్టికల్చర్ అధికారి కిషోర్ , కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మరియు శాస్త్రవేత్తలు, కొత్తగూడెం ఏడిఏ, చుంచుపల్లి మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు, అనుబంధ శాఖల అధికారులు, సాయిల్ శాంపిల్స్ వాలంటీర్లు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :