తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 10 తెలుగు వెలుగు ) : MPTC ,ZPTC ల ఎన్నికలు నిర్వహణకు అయా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికలసంఘం సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని పేర్కొంది. దానిలో భాగంగా జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మండలంలోని 10 ఎంపీటీసీ స్థానములు, ఒకటి జెడ్పిటిసి స్థానములకు సంబంధించి ఓటర్ల జాబితా మరియు 61 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి మరియు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పార్వతి కార్యాలయ సిబ్బందితో నోటీస్ బోర్డుపై తుది జాబితాను ప్రదర్శించారు
Admin
తెలుగు వెలుగు టీవీ