Monday, 03 August 2026 03:19:02 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కార్మికులను సింగరేణి యాజమాన్యం కట్టుబానిసలుగా చూడటం సరికాదు - కూనంనేని సాంబశివరావు

Date : 08 June 2026 06:57 PM Views : 133

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కార్మికులను సింగరేణి యాజమాన్యం కట్టుబానిసలుగా చూడటం సరికాదు. - సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్దం - ఈ 12 ఏళ్ల వద్దుపై యాజ మాన్యం శ్వేతపత్రం విడుదల చేయాలని - ఏవైనా ప్రాజెక్టులకు కొమరయ్య, శేషగిరిరావు, విఠల్ రావు పేర్లను పెట్టాలి - యాజమాన్యానికి నేడు సమ్మె నోటీస్ - విలేకరుల సమావేశంలో కూనంనేని కార్మికుల శ్రమ శక్తితో మనుగడ సాగిస్తున్న సింగరేణి సంస్థ, అదే సంస్థల్లో అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులను ప్రభుత్వాలు, యాజమాన్యం కట్టుబానిసకలు కూడటం సరైంది కాదని, కార్మిక సమస్యలను పరిష్కరించకుంటే సింగరేణి వ్యాప్తంగా సమ్మెకు సిద్దమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) గౌరవ అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్పి కూనంనేని సాంబశివరావు అన్నారు. రెండురోజులుగా వర్కర్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్సమావేశాలు రుద్రంపూర్లో ఆర్సిఓఏ క్లబ్లో జరిగాయి. చివరి రోజు సోమవారం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేసిన విలేకరుల సమావేశంలో, కూనంనేని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని బంగారుబాతులా వాడుకుంటున్నాయని, సంస్థ మనుగడకు పాటుడుతూ ఉత్పత్తిని, ఆదాయాన్ని పెంచే మార్గాలను వదిలిపెట్టి సంస్థలో ఉన్నడాన్నంతా దోచుకుని సంస్థ మూసివేసే దశకు చేరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక యంత్రాల ద్వారా సంస్థ పనులు చేయించి కార్మికులు లేకుండా చేయలనే ఉద్దేశ్యంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ ఇత్పత్తి అయ్యే బొగ్గులో నాణ్యత లేదనే సాకులు చూపుతున్నారని, నాణ్యత, నాణ్యత తక్కువగా ఉన్న బొగ్గును కలిపి అవసరమైన పరిశ్రమలకు విక్రయించేందుకు దృష్టి సారించాలని చెప్పారు. దీనిని సాకుగా చూపి సింగరేణి మనుగడను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోమని చెప్పారు. సంస్థ నష్టాల్లో నడుస్తోందంటూ చెబుతున్నారని, ఎవరి వల్ల నష్టాలు వచ్చాయని, ఎందుకు వస్తున్నాయని, దానికి కారణాలు ఎంటో తెల్పాలన్నారు. ఈ 12 ఏక స్వరాష్ట్రంలో గత ఈ ప్రభుత్వంలో వచ్చిన ఆయం లాభాలు మసలవదుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా చోద్యం చూడటం సరైంది కాదన్నారు. సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్నప్రాజెక్టులకు కార్మిక నేతలు కొమరయ్య, శేషగిరి రావు, విఠల్ రావు పేర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. సంస్థలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, సొంతింటికి రుణసదుపాయాన్ని కల్పించాలని, డిపెండ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, డిపార్ట్మెంట్ పోస్టులు భర్తీ చేయాలని, సహజన మరణం పొందిన వారికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, 30 డిమాండ్ల సాధనకు గుర్తింపు సంఘం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు సోమవారం యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందిస్తున్నామని, న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయకుంటే ఆర్టిసి సమ్మెకు మించిన సమ్మెను చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాల రంగయ్య,,కె సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మద్ది ఎల్లయ్య, వైవి రావు, ముస్కే నమ్మయ్య, వంగా వెంకట్, వీరస్వామితో పాటు అన్ని ఏరియాల బ్రాంచ్ కార్యదర్శులు, సెంట్రల్ కౌన్సిల్సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :