తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం భారీ రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉదయం 9 గంటల నుంచే ఓపీ వద్ద క్యూ కట్టారు. చీటీ తీసుకోవడానికి గంటల సమయం పట్టడంతో పాటు, పలు విభాగాలు కిక్కిరిసిపోయాయి. కూర్చునే స్థలం లేక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది.
Admin
తెలుగు వెలుగు టీవీ