తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 13(తెలుగు వెలుగు)మూడు నెలల పాపను అక్రమ దత్తత ఇచ్చిన తల్లిదండ్రుల పైన మరియు దత్తత తీసుకున్న దంపతుల పైన కేసు నమోదైన ఘటన జూలూరుపాడు మండల పరిధిలో జరిగినది. వివరాల్లోకి వెళ్ళితే జూలూరుపాడు మండలం లోని ఓ గ్రామానికి చెందిన గిరిజన దంపతులు తమకు గలిగిన మూడవ ఆడ సంతానాన్ని కొత్తగూడెం శివారు ప్రాంతానికి చెందిన దంపతులకు సుమారు లక్ష రూపాయలకు విక్రయించారనే సమాచారం తమకు తెలిసి అచ్చటకు వెళ్లి పరిశీలించగా సదరు మూడు నెలల పాప అక్కడ ఉన్నట్లు నిర్ధారించామని నిబంధనలకు వ్యతిరేకముగా చిన్నపిల్లలను అమ్మడం కొనడం నేరమైనందున అంగనవాడి ప్రాజెక్టు సూపర్వైజర్ -చెండ్రుగొండ మాడుంబ లక్ష్మి ఫిర్యాదు పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినారు
Admin
తెలుగు వెలుగు టీవీ