Saturday, 19 September 2026 05:52:46 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు - కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 September 2025 01:16 PM Views : 507

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం ముఖ్యమంత్రి బెండలపాడు గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందని, పెద్ద ఎత్తున పూర్తయిన ఇండ్లలో పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు జరగడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలంపాడు గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని సందర్శించడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సభా ప్రాంగణానికి వచ్చే లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రవాణా, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సహాయం, భద్రత వంటి ఏర్పాట్లు పూర్తిగా చేయాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలలోపే అన్ని బస్సులు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి బస్సుకు ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించి లబ్ధిదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. సభలో అధిక జనసంచారం కారణంగా ఒత్తిడి తలెత్తే అవకాశమున్నందున చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు సభకు రాకుండా చూడాలని సూచించారు. సభ ముగిసిన తరువాత బస్సుల్లో వచ్చిన లబ్ధిదారులు తిరిగి తమ గమ్యస్థానాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునే వరకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా గౌరవానికి అనుగుణంగా ముఖ్యమంత్రి పర్యటన అత్యంత పకడ్బందీగా , విజయవంతంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :