తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 1తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ద్వారం వద్ద విద్యుత్ ప్రమాదం పొంచి ఉంది. తాతల నాటి శిధిల అవస్థలో ఉన్న స్తంభాలపై పైన 11 కెవి, కింద యల్ టీ విద్యుత్ లైన్లు తీయడం వలన హై టెన్షన్ కరెంటు తీగలు దండెలు లాగా వేలాడుతూ పాఠశాల విద్యార్థులను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలే వర్షాకాలం అందున తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు ఉండడం వలన ఏ క్షణం ఏం ప్రమాదం జరుగుతుందోనని పరిసర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. జనావాసాలు, పాఠశాల ఆవరణం నుండి విద్యుత్ లైన్ ను మార్చాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదంటూ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత పై అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ లైన్ మార్చి ప్రమాదం నుండి కాపాడాలని పాఠశాల విద్యార్థులు, పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ