తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం ఏడు వార్డుల నిరుద్యోగ యువతకు సింగరేణి కార్పొరేట్ సెక్యూరిటీ గార్డ్ నియమకాలలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం కలిపించి రామవరం నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో GM గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ సెక్యూరిటీ గార్డ్ నియామకాల పద్ధతి సరైనది కాదని రామవరం నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకుంటుంటే వారి దరఖాస్తు తీసుకోకుండా మీకు అవకాశం లేదనడం విడ్డూరంగా ఉందని కొత్తగూడెం మున్సిపాలిటీలో భాగం రామవరం కాదా అని వారు ప్రశ్నించారు, రామవరం నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు న్యాయం జరిగే విధంగా సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కంచర్ల జలయ్య, ఎస్ కే, ఫహీమ్ దాదా, భూక్య శ్రీను, గుగులోత్ నగేష్, డబ్బేటి వంశీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ